A Reflection on culture & Confinement

స్వీయ నిర్బంధం

Author:

Suryanarayana Murty Naudari

Postition:

Poet and Translator

University:

Andhra University

ప్రసారమాధ్యమాలు ఇరవైనాలుగు గంటలూ ఒకటే రొద  
‘లాక్ డౌన్’ (Lock down) సమయంలో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోమని:
కేవలం ఇంటికే పరిమితమవండి…
ముక్కుకీ మూతికీ  ముసుగు ధరించండి…
సామాజిక దూరాన్ని పాటించండి…
క్రిమిసంహారిణితో చేతులు పరిశుభ్రం చేసుకోండి…  
లేదా, సబ్బునురగతో 20 సెకన్లపాటు రుద్ది చేతులు కడుక్కోండి…

అయినా, ఈ నియమాలు నేను పాటించనిదెప్పుడని?  
ఈ కొరోనా మహమ్మారి రాకముందునుండే 
ఈ ప్రపంచం – భిన్నమతాల, సిద్ధాంతాల, తత్త్వచింతనల,
వివాదాస్పద వాదాల- అంటురోగాల నిలయమని నాకు తెలుసు.
అందుకే నేను నా నమ్మకాల గూటిలో పదిలంగా దాక్కున్నాను.
అసూయాపరులు నాది ఒంటెద్దుపోకడనీ, నా మతవిశ్వాసాలలో, నమ్మకాలలో, 
ఇష్టాయిష్టాలలో బందీనై సంఘనిషేధం అవలంబిస్తున్నాని అంటేఅననీ. నాకేం?        
అది నాలుగు ప్రక్కలనుండీ రోజూ నా ఆలోచనలపై జరిగే దాడినుండి
నాకు రక్షణకవచాన్నీ, నిరోధకశక్తినీ ప్రసాదిస్తుంది.   

ఓహ్! పిచ్చివాళ్ళు! వీళ్ళా నాకు ముసుగు వేసుకోమని చెప్పేది?   
దేవతావస్త్రాల్లాంటి నా ముసుగుల్ని వాళ్ళెప్పుడైనా పోల్చుకోగలిగేరా? 
హ! హా! నాకు తెలియదేమిటి? నా మాట ఎప్పుడూ మర్యాదగా ఉంటుంది.
నా వైఖరి నాగరికంగా, నా నడత సరసంగా, సున్నితంగా 
ప్రతీదీ నా తక్షణ అవసరానికి సరిపోయేలా అమరి ఉంటుంది.

సామాజికదూరమట సామాజిక దూరం! అదీ నేనూ కవలలం.
నే నెప్పుడో నా అప్పచెల్లెళ్ళనీ అన్నదమ్ముల్నీ, మిత్రులనీ 
చుట్టం అనదగ్గవాడు ఎవడైనా,  వాళ్ళని దూరంగా అట్టిపెట్టేను.
ఎందుకంటే, వాళ్లలాంటి విషపురుగులు మనకెక్కడా తారసపడరు.
నాకు ఈ మేధావులమనుకునే వాళ్ళనీ, వాళ్ళ బుర్రలుమార్చే కుతంత్రాలనీ
ఎంతవరకు సహించాలో, ఎప్పుడు ఎలా నియంత్రించాలో పూర్తిగా తెలుసు.
అదృష్టవశాత్తూ, నా మతవిశ్వాసాలలో నాకు లోతైన అవగాహన ఉంది.
అది అంటరానివారూ, విశ్వాసదూరులూ, వగైరాలగురించి ముందే హెచ్చరించింది. 
వాళ్ళ ఋజువులూ, వాదనలూ ఎప్పుడో చూడడం, వినిపించుకోవడం మానేశాను.
లేకపోతే, అవి అంటురోగంలా నా వివేకాన్నిపాడుచేసి, ఆలోచనలు ఖరాబు చేస్తాయి.

మీరు నా మాటని కవిత్వంగా పొరపడొచ్చు, కానీ, ఇది ముమ్మాటికీ నిజం.
ప్రతిరోజూ నేను బయటకు వెళ్ళే ముందూ, రాత్రి పడుక్కోబోయే ముందూ
ప్రార్థనతో నన్ను నేను పరిశుభ్రం చేసుకుంటాను.
సమాజంకోసం నేను రోజల్లా అయిష్టంగా చేసినవన్నీ, సరిదిద్దుకుంటాను.
‘తండ్రీ! వాళ్ళను క్షమించు! వాళ్ళు ఏమిచేస్తున్నారో వాళ్ళకు తెలియదు!’
ఇష్టం లేకపొయినా, సంఘజీవిగా వాళ్ళమధ్య బ్రతకక తప్పదని తెలుసు,
వాళ్ళకి నీతీ, విలువలూ, జ్ఞానం, కర్మాచరణలో చిత్తశుద్ధీ లేవని తెలుసు.
అదృష్టం కొద్దీ, నా మతం నా కివన్నీ బోధించి ఎలా నడుచుకోవాలో నేర్పింది.

ఇలా అన్నానని తప్పుపట్టొద్దు! ఈ ప్రపంచమొక అంటురోగపు-ఆలోచనల పుట్ట.
అవి మిమ్మల్ని ఎల్లప్పుడూ చుట్టుముట్టి ఉంటాయి. కనుక మీరు 
విద్యుత్కణ సూక్ష్మదర్శినివంటి కళ్ళతో బహుపరాకుగా ఉండాలి.
చూడ్డానికి అమాయకంగా కనిపించే ఆలోచనలు, విషపురుగు లాగే,
మన మనసులో జొరబడేదాకా వాటంతట వాటికి ఉనికి ఉండదు.
ఒకసారి ప్రవేశిస్తే చెప్పేదేముంది!  మనల్ని వశపరుచుకుని,
శరీరాన్నీ, ఆలోచనల్నీ నియంత్రణలోకి తెచ్చుకుంటాయి.
ఏది కాకూడదని అప్పటివరకూ మనం భయపడ్డామో,
అలా మనల్ని మార్చేస్తాయి.  అందుకనే,
నేను వాళ్ళు చెప్పే అర్థంపర్థంలేని మాటలు విన్నప్పుడల్లా,
సరాసరి ఇంటికి పోయి, కట్టుబట్టలతో,
ఒక గంటసేపు శుభ్రంగా స్నానం చేస్తాను.

Self- quarantine
The media blare round the clock
The precautions during lock down:
Strictly confine to home…
Wear a mask…
Maintain social distancing…
Use sanitizer…
Or wash in rich lather for 20 seconds
and so on.

But when did I not?
Even without the Pandemic, Corona
The world is an infectious mess
Of faiths, isms, philosophies, and moot theories.
That’s why I sequester myself in my safe cocoon
Let envious blame I quarantine myself
In my faith, beliefs, likes and dislikes.
Which ensures my immunity, and safety
From every day onslaught of every kind.

Oh! These people speak of masks, Poor Richards!
Could they ever detect and perceive the obscure masks I wear?
Ha! Ha! I know. For, my speech was always polite,
my mien civil, and my actions suave and gentle
And each, perfectly adapted, to my purpose on hand.

Social distancing ? … That idea was connate with me.
I long distanced my kith and kin,
friend and every relation worth the name,
For, you can never find a sucking virus like them.
I know how to put them in their place,
the so-called intellectuals and their brainwashing.

Fortunately I have a good grounding in my religion
That taught me much about untouchables, infidels, and their ilk.
I long shut off my eyes and ears to every advice and argument
Lest they should infect my mind and corrupt my thinking.
You may mistake it for a metaphor, but true,

I sanitize myself with prayer every morning
Before venturing out, and every night, before going to bed.
I try to undo what all I did the whole day for society’s sake:
‘Father, forgive them, for they don’t know what they are doing.’
I know I am compelled to live one among them, unwillingly though
For, they have no morals, no values, no knowledge, and integrity
Fortunately my religion gave me good grounding to conduct myself.

Make no mistake! The world is such a hive of infectious ideas
They besiege you, and you should be on guard
With the watchful eyes of an electron microscope.
Those innocuous ideas, like virus, have no existence
Until they touch us, and, instantly become highly active
They hypnotize, take control of our mind and body
Corrupting us to become what we never wanted to be.
That’s why, whenever I hear such nonsense,
I rush home and take a thorough wash for one hour,
Along with the dress I wear.

Mr. Suryanarayana Murty Nauduri is a bi-lingual poet and translator in English and his native language, Telugu.  He published his first volume of poetry ‘The Incidental Muses’ (1999); ‘Tangs of Telugu’ (2007) and ‘Wakes on the Horizon’ (2016) (some select poems from Telugu rendered into English); and brought out The Palette'(1997), ‘The Easel’ (2015) and ‘The Canvas’ (2019) (some select short stories from Telugu rendered into English) as part of a tetrology planned with RS Krishna Moorthy. The last of the series, ‘The Painting’ is in preparation. He presently resides in Bangalore, Karnataka.

Author:

Suryanarayana Murty Naudari

Postition:

Poet and Translator

University:

Andhra University

Scroll to Top